ఇష్టానుసారంగా మందమర్రి మున్సిపాలిటీ కాంట్రాక్టర్ పనులు
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో బస్టాండ్ ఫ్లైఓవర్ నుండి రైల్వే ట్రాక్ వరకు మున్సిపాలిటీ నుంచి రెండు కోట్ల 20 లక్షల రూపాయల సైడ్ డ్రైన్ మంజూర్ అయింది టెండర్ రూపకంగా రావికంటి వెంకటేశం టెండర్ ద్వారా వర్కులు స్వాధీనం చేసుకొని పని మొదలు పెట్టిన తర్వాత ఇప్పటికీ మూడు నుంచి నాలుగు నెలల అయినప్పటికీ పని పూర్తి చేయలేదు సైడ్ డ్రైన్ కూడా ఒక కాడ ఎత్తు కట్టడం మరో కాడ తక్కువ డౌన్ గా కట్టడం వంకలు వంకలు కట్టుకుంటూ విరుద్ధంగా కట్టడం జరుగుతున్నది వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇలా ఎందుకు కడుతున్న వనీ అడిగితే దురుసుగా సమాధానం చెప్పడం జరిగిందీ గత మూడు నెలల నుంచి పని పూర్తి చేయలేకపోవడం వల్ల చిరు వ్యాపారులు ఎంతో నష్టపోయారు కిరాయిలు కట్టని పరిస్థితిలో ఉన్నారు , ఎంత మొరపెట్టుకున్నా కూడా పని పూర్తి చేయలేక డ్రైయిన్లు డౌన్ కట్టారని అది తీసుకుపోయి ఏఈ డిఈ కమిషనర్ * *టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు నలుగురు కూడా వచ్చి అవి చూసిన తర్వాత ఈ డ్రైన్ తప్పుగా కట్టావు అనీ వ్యాపారస్తులు ఫిర్యాదు చేశారు కాబట్టి వాటిని సరి చేయాలని ఆఫీసర్ చెప్పిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదు వ్యాపారస్తులు ఎన్నిసార్లు అడిగినా నీ దిక్కున కడ చెప్పుకో పొమ్మంటూ వల్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అసలు వర్క్ దగ్గరికి రావట్లేదు గుమస్తాలను పెట్టి పని నడిపించడం వల్ల నాణ్యతలేని పని చేస్తున్నాడని దీని విషయంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తామని చెప్పినప్పుడు కూడా వల్ల మాటలను పెడచెవినబెట్టి వెళ్తా ఉన్నాడు పని మాత్రం చేయడం లేదు వర్షాలు పడితే ఆ నీళ్లు డ్రైన్ లో పోకుండా నీళ్లు మొత్తంగా నిలిచే అటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని విషయంలో ఆఫీసర్లు కానీ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఎగుడుదిగుడుగా కట్టినటువంటి డ్రైన్ ను పైకి లేపించాలని లేనియెడల షాపులోలకి నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి గనుక దీన్ని అధికారులు చొరవ తీసుకొని చేపించాలని ఈ డ్రైన్ చేయకపోతే వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు నష్టపోతారని తెలియజేస్తున్నారు.

అలాగే డ్రైన్ పక్కన ఎలక్ట్రిక్ పోల్స్ ఇష్టానుసారంగా పెట్టడం జరిగినది పాత బస్టాండ్ దగ్గర నుండి ఎలక్ట్రిక్ పోల్స్ డ్రైన్ పక్కన పెట్టడం జరిగినది క్రమేనా కిందికి వస్తున్న కొద్దీ డ్రైన్ పక్కన కాకుండా డ్రైన్ కి ఎలక్ట్రిక్ ఫోలికి మధ్యల మూడు మీటర్ల దూరం వరకు వచ్చేలాగా పెట్టడం జరిగినది ఎలా పెట్టడం వలన ఆ యొక్క గల్లీలోకి వాహనాలు ఫోర్ వీలర్ వాహనాలు తిరగడం ఇబ్బందిగా మారినది కావున ఇది సంబంధిత అధికారులు గమనించి ఎలక్ట్రిక్ ఏఈ మున్సిపల్ కమిషనర్ గమనించి ఆ ఎలక్ట్రిక్ పోల్స్ ఇప్పుడు పెట్టిన స్థలం నుండి తీసి డ్రైన్ పక్కన పెట్టి బస్తి వాసులకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము.
ఎలక్ట్రిక్ పోల్స్ రోడ్ మధ్యలోకి తీసుకురావడం వల్ల మునుముందు భవిష్యత్తులో ఫోర్ వీలర్స్ గాని ట్రాక్టర్స్ గాని బోర్వెల్ లారీస్ కానీ గల్లిలో తిరగడం కష్టంగా ఉంటది కాబట్టి సంబంధిత అధికారులు దీనిని గమనించి ఇప్పుడు పెట్టిన ఎలక్ట్రిక్ పోల్స్ స్థలం నుండి మళ్ళీ దానిని డ్రైన్ పక్కనికి మార్చాల్సిందిగా బస్తివాసులు అందరు కోరుతున్నాము.
*ఎలక్ట్రిక్ పోల్స్ ను డ్రైన్ కి దూరంగా జరపడం వల్ల రామన్ కాలనీ ఫ్లైఓవర్ మీద నుండి ఏదైనా పెద్ద వెహికల్ స్పీడ్ గా వస్తే అదే సమయంలో గల్లీలో నుండి ఫోర్ వీలర్ వస్తే అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలుంటాయి కాబట్టి ఇది గమనించి ఆ ఎలక్ట్రిక్ పోల్స్ ని డ్రైన్ కి దగ్గరగా వేయాలని వ్యాపారస్తులు బస్తీ వసూలు మందమర్రి ప్రజలు కోరుతున్నాము.