
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో గురువారం రోజున బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టరు పగడాల కాళీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో రానున్న పార్లమెంటు ఎలక్షన్ లో బీజేపీ గెలుపు గురించి పరకాల మండల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్ లల్లో బీజేపీ అభ్యర్థిని అధిక మెజారిటీ తో గెలిపించాలని అందుకు గ్రామస్తాయి కార్యకర్తలు నాయకులు కృషి చేయాలనీ అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల రూరల్ మండలం అధ్యక్షులు ముష్కే దేవేందర్,మండల నాయకులు శక్తి కేంద్రం ఇన్చార్యులు భూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు