Plates and Food Distributed to Students in Memory of Former Sarpanch
విద్యార్థులకు ప్లేట్లు, అన్న వితరణ పంపిణీ
తాండూరు, నేటి దాత్రి:
తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఉమ్మడి ద్వారాకపూర్ మాజీ సర్పంచ్ దివంగత సాత బానయ్య రెండో వర్థంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కాసిపేట ప్రాథమికోన్నత పాటశాల విద్యార్థులకు ప్లేట్లు, అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముదాం వనజ మాట్లాడుతూ.. దివంగత మాజీ సర్పంచ్ సాత బానయ్య ఉమ్మడి ద్వారాకపూర్ పంచాయతీని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. వర్థంతి నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కస్తూరీ మాధురి, శ్రీధర్, ఉప సర్పంచ్ బోయిని సుమలత, మాజీ గ్రంథాలయ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు, డిసిసి ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గట్టు మురళీధర్ రావు, మాజీ జెడ్పీటిసి సాలిగాం బానయ్య, మాజీ ఎంపిపి సిరంగి శంకర్, వార్డు సభ్యులు గోవర్ధన్, గోపాల్, తిరుపతి, రమేష్, నాయకులు సంతోష్, నాగరాజు, సాగర్, ఎస్ సంతోష్, కిరణ్, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
