నాసిరకం ఇసుకతో మోడల్ ఇందిరమ్మ హౌస్ నిర్మాణం పనులు..
పునాదిలోనే నాసిరకం పనులు చేస్తే భవనం భవిష్యత్తు ఏమిటి..?
స్థానిక ఇసుకతోటే పనులు చేయాలని ఆదేశాలు.
హౌసింగ్ డి.ఈ విష్ణువర్ధన్ రెడ్డి వింత వివరణ..
నర్సంపేట,నేటిధాత్రి:
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు ప్రారంభం చేసింది. కాగా అందుకు సంబంధించిన మోడల్ ఇందిరమ్మ భవనాన్ని ప్రతి మండలానికి ఒక భవనం నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జార్ చేసింది. ప్రజలు లబ్ధిదారులు ఇందిరమ్మ పథకంలో బాగంగా 400 స్క్వేర్ ఫీట్స్ తో రూ.5 లక్షల నిధులతో ఇంటి నిర్మాణం నమూనా కోసం హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రాలలో ఇందిరమ్మ పథకం మోడల్ భవనం నిర్మాణ పనులు చేపట్టారు. కాని ఆ భవనం నిర్మాణ పనులు పునాదిలోని నాసిరకంగా పనులు చేపట్టడం వాళ్ళు చర్చలకు దారితీస్తున్నది. దుగ్గొండి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో
400 స్క్వేర్ ఫీట్స్ తో రూ.5 లక్షల నిధులతో నమూనా భవనం నిర్మాణం పనులు ప్రారంభం చేశారు. భవనం నిర్మాణం పనులు మొదలుపెట్టిన అధికారులు పునాదిలోని నాసిరకం ఇసుకతో పనులు చేపట్టడం పట్ల పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భరణం పునాదిలోనే నాసిరకంగా పనులు చేపడితే ఏంద తరబడి ఉండాల్సిన భవనం ప్రమాదాల గురయ్యా అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాసిరకం పనులు చేపట్టకుండా నాణ్యతతో కూడిన పనులను చేపట్టి గ్రామాల్లో చేపట్టబోయే ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు నిలువుటద్దంగా నిరూపించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
స్థానిక ఇసుకతోటే పనులు చేయాలని ఆదేశాలు..
హౌసింగ్ డి.ఈ విష్ణువర్ధన్ రెడ్డి వింత వివరణ..
దుగ్గొండి మండల కేంద్రంలో ఇందిరమ్మ హౌసింగ్ నమూనా భవనాన్ని 400 స్క్వేర్ ఫీట్లతో 5 లక్షల రూపాయల నిధులు వ్యయంతో నిర్మాణం కోసం పనులు ప్రారంభించాము. భవనం నిర్మాణం కోసం రోబో ఇసుక, గోదావరి ఇసుక వాడాల్సి ఉంటుంది. మేము కొత్తగా వరంగల్ జిల్లాలో బాధ్యతలు తీసుకున్నాము. ప్రస్తుతం లోకల్ ఇసుకతో పనులు ప్రారంభం చేపట్టాము. ఇప్పుడున్న లోకల్ ఇసుకను మార్చి గోదావరి ఇసుకతో పనులు చేపడతామని హౌసింగ్ డిఈ విష్ణువర్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు.