
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని టీఎస్ డబ్ల్యూఆర్ పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రోజున అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పెరిగిపోతున్న కాలుష్యానికి, వాతావరణంలో జరుగుతున్న తీవ్రమార్పులకు వివిధ వైపరీత్యాలకు చెట్లను పెంచడం సంరక్షించడం ఒకటే పరిష్కారమని అందువలన చెట్ల పెంపకం,సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతలా భావించాలని అటవీ శాఖ వారు తెలియజేశారు. పాఠశాలలో భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పండ్ల మొక్కలను, పూల మొక్కలను అలాగే ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలను నాటడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ డిఆర్ఓ సాగరిక, ఎఫ్ఎస్ఓ రాంసింగ్,ఎఫ్ బిఓ సతీష్ ,దీక్ష ,జైపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఉదయ్ ఎఫ్ ఏ రాము,మహిళ కూలీలు పాల్గొన్నారు.