వీణవంక :నేటిధాత్రి
మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్
త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వీణవంక మండలంలో అత్యధిక స్థానాలను గెలుచుకొని జయబేరి మోగిస్తుందని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ అన్నారు
మండల కేంద్రంలో అయన మాట్లాడుతూ….గత శాసనసభ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేశామని అన్నారు
అలాగే జులై నెల చివరి వరకు లక్షన్నర రుణమాఫీ రైతులకు పూర్తి చేసి ఆగస్టు మాసంలో సంపూర్ణ రెండు లక్షల రుణమాఫీ అవుతుందని ఆగస్టు నెలలో అర్హులైన లబ్ధిదారుల పేర్లను ప్రకటించి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తామని అన్నారు
మహిళల ఆర్థిక స్వలంబన కొరకు ప్రతి నెల 2500 రూపాయల పథకాన్ని త్వరలో ప్రారంభించి ఎన్నికల హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేస్తారని, ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండి స్థానిక సంస్థలలో క