కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బాసని శాంత విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం
ప్రజల నమ్మకమే మా శక్తి
ఎన్ఎస్ఆర్ అధినేత సంపత్ రావు
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి బాసని శాంత మద్దతుగా ఎన్ఎస్ఆర్ అధినేత సంపత్ రావు విస్తృత ప్రచారం నిర్వ హించారు. ఎన్నికల్లో సర్పంచ్ గా ఆశీర్వదించి గెలిపిస్తేనే మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తుందని అన్నారు అదేవిoధంగా కాంగ్రె స్ కు మద్దతుగా మండలం లోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామా ల్లో జరిగిన అభివృద్ధి పను లను రాష్ట్ర ప్రభుత్వం అంది స్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో సర్పంచులుగా గెలిపించు కోవాలని కోరారు.
