`మంచి మెజారిటీతో గెలుస్తున్నాను.
`పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి జీవితంలో మర్చిపోలేను.
`ప్రత్యర్థులు పట్టభద్రులకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు.
`విద్యా వేత్తగా నేను అందరికీ సుపరిచితం.
`పట్టభద్రుల స్పందన చాలా బాగుంది.
`పట్టభద్రులు బ్రహ్మ రథం పడుతున్నారు.
`నరేందర్ రెడ్డి ప్రచారంలో మహిళామణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.
`ప్రజలు నరేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు.
`అందరికీ అందుబాటులో వుంటారు అనే పేరు నాకు మాత్రమే వుంది.
`విద్యావేత్తగా అందరికీ తెలిసిన వ్యక్తిని కావడం నాకు కలిసొచ్చే అంశం.
`రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై యువతలో మంచి స్పందన.
`ఉద్యోగాల కల్పన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యం.
`పదేళ్లలో పట్టుమని గత పాలకులు పది కొలువులు ఇచ్చింది లేదు.
`బిజేపికి మాటలు ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు.
`బిజేపి మాటలు నీటి మీద రాతలని తరలిపోయింది.
`దేశంలో బిజేపి వల్ల నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది.
`పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిపోయింది.
`బిజేపి చేతగాని తనం వల్ల అమెరికాలో మన యువత ఇబ్బందులు పడుతున్నారు.
`కాంగ్రెస్ పాలనలో దౌత్య సంబంధాలు చాలా మెరుగ్గా వుండేవి.
`మన దేశం నుంచి వెళ్లిన యువతకు మంచి గౌరవం వుండేది.
`బిజేపి దౌత్యపరమైన అవగాహన రాహిత్యం దేశానికి తీరని నష్టం జరుగుతోంది.
`కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులలో ఒక భరోసా కలిగింది.
`కాంగ్రెస్ ప్రభుత్వంమే ఉద్యోగాలు ఇస్తుందని బలమైన నమ్మకం ఏర్పడిరది.
`ఒక్క ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక చరిత్ర.
`రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో వెంటనే ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తాను.
`ప్రైవేటు రంగంలో కూడా తెలంగాణ యువతకు ప్రాధాన్యత కలిగేలా చూస్తాను.
`రాష్ట్ర ప్రభుత్వం ఐటి విస్తరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.
`ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.
`ఎంతో మంది నిరుద్యోగుల కల నెరవేరేందుకు మంచి రోజులు రానున్నాయి.
`కొన్ని లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దాను.
`వారి సహకారంతో గెలిచి, నిరుద్యోగ యువతకు సేవ చేస్తాను.
హైదరాబాద్,నేటిధాత్రి:
నిత్యం ప్రజల్లో వుంటా..ప్రజలతో వుంటా…ప్రజల జీవన విదానంలో వుంటా..ప్రతి నిమిషం ప్రజలతోనే గడుస్తుంది. రోజులో ఏ కొద్ది సమయమే నా కోసం వుంటుంది. మిగతా సమయమంతా ప్రజలోనే వుంటుంది. నిత్యం ఎంతోమందిని కలుస్తుంటాను. సమాజాన్ని దగ్గరుండి చూస్తుంటారు. సామాజిక సమస్యలు ప్రతి క్షణం అద్యయనం చేస్తుంటాను. పేదరికంలో మగ్గుతున్న జీవితాలను చాలా దగ్గరగా వుండి చూస్తుంటారు. నేను వ్యాపార వేత్తను కాదు. విద్యా వేత్తను. ప్రతి ఏటా కొన్ని వేల మందిని సమాజంలోకి పంపిస్తుంటారు. పసి వయసు నుంచి నా విద్యా సంస్ధలతో వారు పెనవేసుకున్న అనుబంధం, వారిని ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే వరకు వారితో నా ప్రయాణం సాగుతుంది. ఇది ఒక్క ఉపాద్యాయుడికి మాత్రమే దక్కుతుంది. అందులో విద్యా సంస్దల నిర్వహణతో నేను అనేక పాఠాలు నేర్చుకుంటాను. వాటిని మా విద్యాలయాల ద్వారా విద్యార్దులకు, పరోక్షంగా సమాజానికి నేర్పిస్తుంటాను. దేశ విదేశాలలో విద్యా వ్యవస్దల మీద నిరంతరం అధ్యయనం కొనసాగుతుంది. మన పిల్లల ఉత్తమ భవిష్యత్తుకు మార్గలు వేయడం జరుగుతుంది. సమాజంలో చైతన్యాన్ని నింపేందుకు నిరంతరం కృషి చేస్తుంటారు. అనేక సభలు, సమావేశాలకు హజరౌతుంటాను. సామాజిక స్ధితిగతుల మీద నిరతంరం ఉపన్యాసాలు ఇస్తుంటాను. ఇలా నా జీవితమంతా ప్రజలతోనే ముడిపడి వుంటుంది. తెలంగాణలో నన్ను గుర్తు పట్టని వారుండరు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాతో పరిచయం లేని వాళ్లంటూ వుండరు. నా విద్యా సంస్దల్లో చదువుకున్న వాళ్లు, వారి తల్లిండ్రులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇలా అన్ని రంగాల ప్రజలతో నాకు వున్నంత సత్సంబందాలు మరెవరికీ వుండవు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. నాపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాను. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వ విజయాలలో ప్రధాన భూమిక ఉద్యోగ కల్పనపై ప్రజలకు వివరిస్తాను. వారికి మెరగైన ఉపాది కల్పన కోసం కృషి చేస్తాను. నా మాటల మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీపై వున్న విశ్వాసంతో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అంటున్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, ఆల్‌ఫోర్స్ విద్యా సంస్దల అదినేత డాక్టర్. వి. నరేందర్ రెడ్డితో నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు చెప్పిన విషయాలు, వివరాలు ఆయన మాటల్లోనే…
సమాజంలో ఉన్నత లక్ష్యాలు, వ్యక్తిగత ఆశయాలు, వాటిని నిజం చేసుకునే అవకాశం కల్పించే ఏకైక వారధి విద్య. ఆ విద్యను కొన్ని లక్షల మందికి ముప్పై సంవత్సరాలకు పైగా అందిస్తున్నాను. అలా ప్రజలతో నా ప్రయాణం ఇప్పటి వరకు ఎంతో గొప్పగా సాగుతోంది. అందుకు కారణం నా అంకితభావమే కారణం. ఒక విద్యా వేత్త సమాజం గురించి ఆలోచించినంతగా మరెవరూ ఆలోచించరని ఆ నా అభిప్రాయం. ఈ సమాజం నాది. నా సమాజం ఎప్పుడూ ఉన్నతంగా వుండాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. అంతే కాకుండా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, దేశంలో పంచవర్ష ప్రణాళికలు రూపొందిం చి,ఐదేళ్లకోసం లక్ష్యాలను నిర్ధేశించుకొని దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపించింది కాంగ్రెస్ పార్టీ. బిజేపి పార్టీకి అలాంటి లక్ష్యాలు ఏమీ లేవు. దేశాబివృద్దికి ప్రధాన్యతలు లేవు. ప్రణాళికలను ఎత్తి వేసినప్పుడే బిజేపి అంతరంగం అర్దమైంది. కేవలం రాజకీయం తప్ప ప్రగతి దారి మూసేయమే బిజేపి లక్ష్యంగా మారింది. అలాంటి ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు తప్ప ఉఫాది కల్పించింది లేదు. ప్రజల జీవితాల్లో వెలుగు నిందింది లేదు. వికసిత్ భారత్ అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉపాధి కల్పనలో మహాత్మాగాంధీ ఉపాధి హమీ పధకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పధకం వల్ల పల్లె ప్రజలకు నిత్యం ఉపాది కలుగుతోంది. ఆ పధకాన్ని కూడా అటెకెక్కించే కుట్ర బిజేపి చేస్తోంది. ఈసారి బడ్జెట్‌లో ఈ పదకం ప్రస్తావన కూడా తేలేదు. ఉపాధి పథకం కూలీ పెంచలేదు. పైగా రెండు కోట్ల మందిని ఆ ఉపాధి నుంచి తప్పించే కుట్ర చేస్తోంది. ఇలా పేదల జీవితాలను చిద్రం చేస్తూ, పారిశ్రామిక వేత్తలకు తొత్తుగా మారింది బిజేపి. అలాంటి బిజేపి పాలనతో పేదలకు మేలు కన్నా, శాపమే ఎక్కువైంది. ఏ రంగంలో చూసినా అవరోహనమే కనిపిస్తోంది. మధ్య తరగతి మీద పన్నుల మీద పన్నుల వడ్డిస్తూ వారి జీవితాలన చిదిమేస్తున్న పార్టీ బిజేపి. 2014 ఎన్నికల ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది. యువత జీవితాలలో ఆశలు రేపింది. ఈ పదకొండేళ్ల కాలంలో ఉద్యోగాలు ఇచ్చిందిలేదు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చింది లేదు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోంది. దేశంలోనే అతి పెద్దదైన రైల్వే వ్యవస్ధను నిర్వీర్యం చేసి, ప్రైవేటు రంగానికి అప్పగించే కుట్రలు చేస్తోంది. ప్రధాన మంత్రి మోడీ స్వయంగా ప్రభుత్వం వ్యాపారాలు చేయదని చెప్పినప్పుడే ఆయన అంతరంగం పూర్తిగా అర్ధమైపోయింది. మన దేశ స్వామ్య వాద ఆర్ధిక వ్యవస్ధను పూర్తిగా వ్యక్తి ఆర్ధిక వ్యవస్ధగా మార్చి, ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఎల్‌ఐసి లాంటి సంస్ధలను కూడా ప్రైవేటు పరం చేసి, ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్యం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి సాగిస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సివుంది. విద్యా వైద్య రంగాలను పూర్తిగా భ్రష్టు పట్టించి, ప్రజల జీవితాలను ఆగం చేస్తోంది. మన దేశ సగటు ఆయు ప్రమాణమే 69 సంవత్సరాలు. అలాంటిది 70 సంవత్సరాలకు పై బడిన వారికే ఉచిత వైద్యం అని చెప్పి ఇలా కూడా ప్రజలను మోసం చేయొచ్చని నిరూపించిన ఏకైక పార్టీ బిజేపి. బిజేపి ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్ధ విధానాల వల్ల విదేశీ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ట్రంప్ మన విద్యార్ధులను, ప్రజలకు బేడీలు వేసి, తిరిగి పంపిస్తున్నారు. ఒక దేశానికి చెందిన సైనిక విమానం మరో దేశం అనుమతి లేకుండా వాలడం అంటే మనపై ఆధిపత్యాన్ని చూపించినట్లే లెక్క. అయినా స్పందన లేని ప్రధాని మోడీ అమెరికా మందు సాగిలపడడం మన దౌర్భాగ్యం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల కాలంలో ఇలాంటి పరిస్దితులు దేశం చూసిందా? ఇతర దేశాల ముందు సాగిలపడడం జరిగిందా? అందువల్ల దేశ ప్రజల్లో చైతన్యం రావాలి. అది ముందు తెలంగాణ నుంచే మొదలవ్వాలి. తెలంగాణలో బిజేపి పార్టీకి చోటులేదు. ప్రజల ఆదరణ అంతకాన్న లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు కూడా పడదు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రత్యర్ధి పార్టీలకు చెందిన వ్యక్తులు ఎవరూ ప్రజలు తెలిసిన వాళ్లు కాదు. ప్రజల్లో వుండేవాళ్లు కాదు. అందుకే ఎక్కడికెళ్లినా నన్ను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మంత్రి శ్రీధర్‌బాబు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ నా గెలుపు కోసం ఎంతో శ్రమిస్తున్నారు. వారి కృషి వృదా కాదు. వ వారి ఆశీస్సులతో నేను గెలవడం పక్కా…అది కూడా మంచి మెజార్టీతో గెలుస్తాను. గతంలో ఏ పార్టీ కూడా అదికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే మొత్తంగా ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర లేదు. అది ఒక్క కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకే దక్కుతుంది. అందుకే ప్రజా ప్రభుత్వం మీద ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడిరది. నిరుద్యోగులు తమ ఆశలు, కలలు నెరవేరుతాయన్న విశ్వాసం వారిలో బలంగా ఏర్పడిరది. తాను ఎమ్మెల్సీగా గెలిచిన మరు క్షణం నుంచి నిరుద్యోగుల ఆశల నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తాను. అటు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇటు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తాను. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇస్తూ, యువత భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తోడ్పడతాను..ఇది నా హమీ…