తంగళ్ళపల్లి నేటి ధాత్రి……. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి కాలువలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ వారు కేవలం కమిషన్ల కక్కుర్తి కొరకే తొమ్మిదవ ప్యాకేజీ పక్కనపెట్టి 11వ ప్యాకేజీ ద్వారా పనులు పూర్తి చేయలేదని అలాగే మండలంలో ఏ ఒక్క గ్రామానికి కాలువలను పూర్తి చేయలేదని బిఆర్ఎస్ పార్టీ నేతలవి అతి గతి లేని మాటలని అందుకే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించాలని పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని కేటీఆర్ హరీష్ రావు రైతుల మధ్య నీల పంచాయతీ పెట్టారని రైతుల కోసం అంటూ కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు దోచుకున్నారని మేడిగడ్డ కుంగిపోయి కూలిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ విషయాన్ని మీ ప్రభుత్వానికి వదిలేస్తున్నామని రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే వారికి క్షమాపణ చెప్పాలని మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకరిద్దరి రైతులకు నష్టపరిహారం ఇస్తే అందరికీ సాయం చేసినట్టు అవుతుందా మీకు సమస్యలు పరిష్కరించడం తెలియదు కానీ ఆరోపణలు చేస్తారా తెలంగాణ ప్రజలకు ఏ పార్టీ నుండి ఏ పార్టీకి వచ్చారు తెలుసునని ఏ ఒక్కరోజు రైతులను పరామర్శించిలేదు ఇప్పుడు అనవసర రాదంతం చేస్తున్నారని అభివృద్ధి మాటున కోట్ల రూపాయల ఇసుకను తరలించి వేల కోట్ల రూపాయల బతుకమ్మ చీరల మీద 100 కోట్ల దోపిడీ చేసిన మీరు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు అలాగే కాంగ్రెస్ పార్టీ మీద మా పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి మీద అసత్యమైన ఆరోపణ చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మండల కాంగ్రెస్ నాయకులు జిల్లాల గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామ రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
కాలువలు పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
