జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా షేక్‌పేట్ డివిజన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ “జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల విశ్వాసం ఉంచి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.అనంతరం రాష్ట్ర మంత్రి వర్యులు వివేక్ వెంకట స్వామి కలిసి డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి షేక్ పేట్ డివిజన్ బూత్ కమిటీ అధ్యక్షులు మరియు నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
