మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్
భూపాలపల్లి నేటిధాత్రి
ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ బహి రంగ సభ నిర్వహిస్తున్న ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఈ సందర్భంగా మండలం నుంచి సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో బయలుదేరడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడుతూ
ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో సభా వేదికకు ఇందిరా మహిళా శక్తి పేరు పెట్టారు.
వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవా సభలో పాల్గొననున్నారు.వరంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం లో పాల్గొని ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్య మంత్రి అక్కడే శంకుస్థాపన చెయ్యనున్నారు..
ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, భీమా చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం వేదికపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తా రు.సాయత్రం 5.10 హెలికా ప్టర్ లో హైదారాబాద్ కి తిరిగి వెళతారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వైనాల రవీందర్ చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాంపల్లి వీరేశం జిల్లా వివర్స్ సెల్ అధ్యక్షులు అడేపు సంపత్.మండల కోశాధికారి శాస్త్రాల కిరణ్.జిల్లా నాయకులు కత్తి సంపత్,తోట గట్టయ్య,ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షుడు సంగీ రవి.మండల నాయకులు కోయల చిరంజీవి. వంగ నరేష్. ఎలబోయిన రాజేందర్.ఎండి కంరుద్దీన్.కోరే చందు టౌన్ అధ్యక్షుడు పెరుమాండ్ల క్రాంతి.గజ్జి రమేష్. యవజనకాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల యశ్వంత్.వేణు వివిధ గ్రామాల మండల నాయకులు తరలి వెళ్లారు.