
వేములవాడ నేటిధాత్రి
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్(చెక్కపల్లి బస్టాండ్) లో బండి సంజయ్ దిష్టిబొమ్మను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో దహనం చేశారు. తదనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ డౌన్ డౌన్ ఖబర్దార్ బండి సంజయ్ బిజెపి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ కనికరపు రాకేష్, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమురయ్య,పులి రాంబాబు,పుల్కం రాజు, సగ్గు పద్మ,బొజ్జ భారతి,వస్తాద్ కృష్ణ,అక్కేనపల్లి నరేష్,లింగంపల్లి కిరణ్, కూరగాయల శ్రీశైలం, గంజి జైపాల్, ముంజ ఉమేందర్,ముప్పిడి శ్రీధర్,సాబీర్, నాగుల విష్ణు,నాగుల మహేష్,దూలం భూమేష్, మహమ్మద్ వలీ, కోలకాని రాజు,వనపర్తి శంకర్, తదితరులు ఉన్నారు.