
ముత్తారం :- నేటి ధాత్రి
స్వర్గీయ మాజీ స్పీకర్ దుదిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి
అధికారికంగా ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూదరి సర్వేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీపాదరావు లాంటి గొప్ప వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించిడం హర్శించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. ఆయన తో పాటు సీతంపేట మాజీ సర్పంచ్ పులిపాక నగేష్, నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ లు కూడా హర్షం వ్యక్తం చేశారు.