వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం రాజీవ్ చౌక్ లో బాల్క సుమన్ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు తరలివచ్చారు. మాజీ మార్కెట్ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్, లక్కాకుల సతీష్ కుమార్ ల నేతృత్వంలో రెండు వర్గాలుగా చీలిపోయారు. రెండు వర్గాలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే మే గా రెడ్డి వర్గం మాజీ మంత్రి చిన్నారెడ్డి వర్గం నాయకులు రాజీవ్ చౌక్ కు చేరుకొని నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆలస్యం చేస్తుండడంతో శ్రీనివాస్ గౌడ్ తన అనుచర వర్గంతో కలిసి కూడలి దగ్గర వేచి ఉన్నారు. అదే సమయంలో లక్కాకుల సతీష్ కుమార్ వర్గం అక్కడి నుంచి నిష్క్రమించి అంబేద్కర్ చౌక్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అధికార పార్టీకి చెందిన వారే రెండు వర్గాలుగా చీలిపోవడంతో పట్టణ ప్రజలు వారిని చూసి అవాక్కయ్యారు. వనపర్తి పట్టణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు
వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు
