
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య ఓబిసి మోర్చా అర్బన్ అధ్యక్షులు నాంపల్లి కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరన్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు కన్నం యుగంధర్ బిజెపి సభ్యత్వ జిల్లా సహా ప్రముఖ దొంగల రాజేందర్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో విఫలం చెందిందని అన్నారు హైడ్రా పేరుతో రాష్ట్రంలో పరిపాలన మొత్తం స్తంభించిందని అన్నారు సభ్యత నమోదు ప్రక్రియలో ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై వున్న వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుందని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు నెరవేర్చకుంటే ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కంబాల రాజయ్య చాంద్రా హరీష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు