
తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షుడు హనుమాండ్ల తిరుపతిరెడ్డి,మాజీ టీపీసీసీ సభ్యుడు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డిలతో కలిసి హమ్యా నాయక్ మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మరో 13 నెలల పాటు నిజాం నిరంకుశత్వ పాలనలో ఉందని,చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని,దీంతో సెప్టెంబర్ 17న విమోచన దినంగా పేర్కొంటారని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ఉత్తర్వులు జారీ చేశాయని,అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా వేడుకలు నిర్వహించుకుంటున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంజి విజయపాల్ రెడ్డి,పెదగాని సోమయ్య,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కందాడి అశోక్ రెడ్డి,కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య వైస్ చైర్మన్ జీనుగా సురేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ భూసాని రాము,కోఆప్షన్ సభ్యుడు జలీల్, నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి,కందాడి అచ్చిరెడ్డి, గంజి ప్రసాద్ రెడ్డి,మెరుగు మల్లేశం గౌడ్, గంజి దేవేందర్ రెడ్డి,బిజ్జాల ప్రసాద్,కిషన్ యాదవ్,బిక్షం గౌడ్,ధర్మారపు మహేందర్, రామ్ రెడ్డి,అలువాల సోమయ్య,వెంకట్ రెడ్డి, వెంకన్న యాదవ్, బండారి వెంకన్న,వెన్నం సోమిరెడ్డి, దేవేందర్ రాజు,తండా రవి యాదవ్,మహేష్ యాదవ్,బుచ్చి రాములు,శీలం హరిత,వెలుగు మహేశ్వరి,రామచంద్రు,నరేందర్, సురేందర్ నాయక్,రమేష్ నాయక్, బుచ్చమ్మ,అండమ్మ తదితరులు పాల్గొన్నారు.