తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కన్ సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలాగే వారు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని 9 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకున్న నిరంకుశ పాలన చరిత్ర మీదని మీరిచ్చిన హామీలు ఏమయ్యాయని రాష్ట్రానికి ఇలాంటి భాషా సంస్కృతి నేర్పిన ఘనత బిఆర్ఎస్ పార్టీ అనిగతంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై తీసుకున్న చర్యలు లాగానే బిఆర్ఎస్ పార్టీ నేతలు ఏమైనా ప్రభుత్వంపై అవార్కులు చివాకులు మాట్లాడితే పోలీసులు సైతం వారిపై చర్యలు తీసుకోవాలని మీరు అధికారంలో ఉన్నప్పుడు అహంకారపు మాటలు మాట్లాడారని ఇప్పుడు కూడా అలాగే మాట్లాడితే ఊరుకోమని మీరు చేసిన తప్పిదాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు విసుగుచెంది కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టారని ఇకనైనా మీరు మారాల్సిన పరిస్థితి ఆసన్నమైందని లేనియెడల సరైన టైంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఇకనైనా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదనిఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు గ్రామ అధ్యక్షులు ఎంపిటిసిలు వార్డు సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది