పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామ కాంగ్రెస్ నాయకులు,మాజీ సర్పంచ్ అల్లం రఘు నారాయణ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పరకాల కాంగ్రెస్ నాయకులు రఘు నారాయణ ను కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగితెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు,రాయపర్తి మాజీ ఎంపిటిసి మల్లారెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాసరి బిక్షపతి,యూత్ పట్టణ అధ్యక్షులు మచ్చ సుమన్,మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు ఎండి.అలీ పాల్గొన్నారు.