హసన్ పర్తి/ నేటి ధాత్రి
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా వరంగల్ విచ్చేసిన మాజీ ఎంపీ రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ను హన్మకొండ లోనీ శారదా ఫంక్షన్ హాల్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి పూల బొకే తో అభినందనలు తెలిపారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ హసన్ పర్తి మండల ప్రెసిడెంట్ పోరెడ్డి మహేందర్ రెడ్డి, రేపల్లె శ్రీనాథ్, బ్లాక్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ తిరుపతి, ఎస్సీ సెల్ జిల్లా జాయింట్ సెక్రటరీ ఎర్ర ప్రకాష్, ఇ. శంకర్, మరియు తదితర నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.