చెన్నూర్, నేటి ధాత్రి::
చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ శివారులో గల సబ్ స్టేషన్ పక్కన గల ఇసుక సిమెంటు క్రషర్ నుండి దుమ్ము ధూళి వస్తుందని చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఈరోజు మంచిర్యాల జిల్లా ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈ క్రషర్ నుండి దమ్ము ధూళి వస్తుందని దీని వలన అక్కడ నివసించే ప్రజలకు అనారోగ్య సమస్యలు మరియు అస్తమతో బాధపడుతున్నారని గతంలో చాలాసార్లు మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రెటరీ అండదండలతో లోపాయికరా ఒప్పందంతో ఇసుక క్రషర్ ను నడపడం జరుగుతుంది. ఇలాంటి అధికారులు చేపట్టి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని వెంటనే అధికారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని క్రషర్ ను అక్కడి నుండి తొలగించాలని. చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.