*రేవంత్ వెనుకబడ్డావ్.. సమన్వయం ఏదీ..రాహుల్ క్లాస్*

Rahul Gandhi’s take class to Revanth  :

టీపీసీసీ చీఫ్ రేవంత్కు  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నా రు.

పార్టీని నడిపించాల్సి న వాడిని నీవే వెనకబడుతున్నా వు  అంటూ సూచనలతో
పాటుగా హెచ్చరికలు చేసారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఆదరణ
చూపుతున్నట్లు  తనకు అందుతున్న నివేదికల్లో స్పష్టం అవుతుందని పేర్కొ న్నట్లు
సమాచారం . పార్టీ  పైన తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నా
రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కా జ్ గిరి పార్లమెంట్తో  పాటుగా సొంత
అసెంబ్లీ నియోజకవర్గం  కొడంగల్ లోనూ వెనుకబడి ఉన్నా రని రాహుల్ తేల్చి
చెప్పా రు. పార్టీ అధ్య క్షుడిగా  అందరినీ సమన్వయం  చేసుకోవాలని.. సీనియర్లకు
ఖచ్చితంగా  గుర్తింపు ఇవ్వా ల్సిందేనని  స్పష్టం  చేసారు. ఉత్తమ్ చేసిన ఫిర్యా దు
పైన వివరణ కోరారు.

కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్  గాంధీ  ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించారు.
ఎన్నికల్లో గెలిచేందుకు కార్యాచరణతో సిద్ధమయ్యా రు. కర్ణాటక గెలుపును
తెలంగాణలోనూ   కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నా రు. కర్ణాటకలో కాం గ్రెస్
నేతలం తా కలిసి కట్టుగా పని చేయటం ద్వా రా అధికారంలోకి   వచ్చిన  అం శాన

రాహుల్ గెలుపు వ్యూ హం లో ప్రధాన అంశంగా  గుర్తించారు. ఇప్పు డు  తెలంగాణ
పీసీసీ చీఫ్ రేవంత్ కు అదే విషయాన్ని స్ప ష్టం చేసారు. పార్టీకోసం  అందరూ
కలిసి కట్టుగా పని చేయాల్సిందేనని తేల్చి చెప్పా రు. ఎవరూ వ్యక్తిగత
అభిప్రాయాలు.. ఈగోలతో  వ్యవహరించినా ఉపేక్షించేది  లేదని  తేల్చిచెప్పి నట్లు
విశ్వ సనీయ సమాచారం . తెలంగాణలో  గెలుపే ప్రామాణికంగా  నిర్ణయాలు
ఉండాలని  స్పష్టంచేసారని  పార్టీలో చర్చ  జరుగుతోంది.

రేవం త్ పైన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా సోనియా గాం ధీకి
ఫిర్యా దు చేసారు. తన పైన రేవం త్ టీం సోషల్ మీడియాలో దుష్ప్ర చారం
చేస్తున్నా రని ఆధారాలు సమర్పిం చారు. తనను పార్టీలో నుం చి బయటకు పం పే
విధం గా పొమ్మ నకుం డా పొగ పెడుతున్నా రని నేరుగా సోనియాకు
వివరిం చారు. ఈ అం శం పైన రాహుల్ నేరుగా రేవం త్ ను నిలదీసినట్లు
సమాచారం . ఇదే సమయం లో రేవం త్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆదరణ
తగ్గటం పైనా రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం . మల్కా జ్ గిరి పార్లమెం ట్
పరిధిలోని అసెంబ్లీ స్థానాల పై రాహుల్ గాం ధీ వద్ద ఆసక్తికర చర్చ జరిగిం ది.
మినీ ఇం డియాగా భావిం చే మల్కా జ్ గిరి పార్లమెం ట్ పరిధిలోని అసెంబ్లీ

స్థానాల్లో పార్టీ వెనుకబడి ఉన్న ట్లు సర్వే నివేదికలు అందాయని..పూర్తి
సమాచారం తోనే  రేవంత్ ను రాహుల్ ప్రశ్నలు  సంధించారు.

ఉమ్మడి  రంగారెడ్డి జిల్లాలో ప్రభావం చూపగల నేత పార్టీకి దూరం
అయ్యా రని..అందరినీ కలుపుకు వెళ్లాలని రేవం త్ కు రాహుల్ ఒకిం త గట్టిగానే
సూచన చేసారని పార్టీలో చర్చ జరుగుతోం ది. పార్టీకి వ్యూ హకర్తగా పని చేస్తున్న
సునీల్ టీం కొడం గల్ నియోజకవర్గం లో పరిస్థితులపై ఇచ్చిన నివేదిక ఆధారం గా
రాహుల్ ప్రశ్నిం చినట్లు సమాచారం . పార్టీని పటిష్టం చేయాలనే గుర్నా థ్ రెడ్డి ని
పార్టీ లోకి ఆహ్వా నిం చినట్లు రాహుల్ కి రేవం త్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో
పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉం దని చెప్పి న రాహుల్ గాం ధ నేతల్లో సమస్య లు ఉం టే
చర్చలతో పరిష్క రిం చుకోవాలని సూచిం చారు. పార్టీలో సమస్య లు సృ ష్టిస్తే
ఎవరినీ ఉపేక్షిం చేది లేదని రాహుల్ గట్టిగానే చెప్పి నట్లు తెలుస్తోం ది. అం దరూ
సమన్వ యం తో సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఎన్ని కల్లో అధికారం దక్కే లా పని
చేయాలని సూచించారు. కేసీఆర్ హఠావో..తెలంగాణ బచావో అనే నినాదం తో
పార్టీ నేతలంతా పని చేయాలని స్ప ష్టం చేసారు. తెలం గాణలోని ప్రతీ
నియోజకవర్గం పైన  రాహుల్ వద్ద  పూర్తి సమాచారం  ఉన్నట్లు  గుర్తించిన నేతలు
అప్రమత్తం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *