
Congress
ఓటు చోరు – గద్ది చోడ్….
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓట్ల చోరీకి పాల్పడుతున్న బిజెపి సహకరిస్తున్న ఎలక్షన్ కమిషన్…
దేశ ఎన్నికల సంఘం, బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ, దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది…
ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ, అధికారం కోసం బీజేపీ చేస్తున్న తంతును బహిర్గతం చేయడం మా బాధ్యత…
ఓటును చోరీ చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమానికి నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు , ఎంపీ కావ్య .
వర్దన్నపేట( నేటిధాత్రి):

ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం,బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్న ఈసీ తీరుపై రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఓటు చోరీ పై సంతకాల సేకరణ కార్యక్రమం వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ చౌరస్తాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు.అనంతరం ఓటు చోరీకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగరాజు ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమ సంతకాల ద్వారా నిరసన వ్యక్తం చేశారు.ఓటు చోరీ పై బూత్ స్థాయి, మండల,డివిజన్, గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు,ప్రజా ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి సంతకాలని సేకరించాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ఓటు హక్కును నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
దేశ ఎన్నికల సంఘం, బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ, దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ “ప్రజలు క్షేత్రస్థాయి నుంచి దేశస్థాయి వరకు జాగ్రత్తగా ఉండాలి” అని పిలుపునిచ్చారు అన్నారు.భారత రాజ్యాంగంలో కీలకమైన ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ, అధికారం కోసం బీజేపీ చేస్తున్న తంతును బహిర్గతం చేయడం మా బాధ్యత. ఈ విషయాన్ని గ్రామం నుంచి దేశ స్థాయికి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించాలి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు..ఈసందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడి పవిత్ర హక్కు అని, ఆ హక్కును చోరీ చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. బీజేపీ ఓటు దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేస్తాం అని ఎంపీ తెలిపారు.
కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల డివిజన్ గ్రామ స్థాయి స్థానిక కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్, మహిళా కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….