BJP Demands Immediate Implementation of Promises
కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు వెంటనే అమలు చేయాలి
బిజెపి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఇన్చార్జ్ సీనియర్ అసిస్టెంట్ సాయికృష్ణకు బిజెపి పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షుడు తనుగుల అంబేద్కర్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా గూడూరు సందీప్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకాలు, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి హామీలు ఇంకా అమలులోకి రాలేదని తెలిపారు.రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు భరోసా సమయానికి అందకపోవడంతో పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వెంటనే హామీలు అమలు చేయకపోతే బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుంభం కోమల్ రెడ్డి, పొదిళ్ల రామచందర్, కట్కూరి దామోదర్, నూనె రంజిత్, గోలి యుగేందర్, తాళ్లపల్లి రాము, రాజు, మల్యాల వంశీకృష్ణ, ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, అచ్చ దయాకర్, కొంకిసా విగ్నేష్ గౌడ్, ముత్యాల శ్రీనివాస్, బానోతు రాజేందర్, సామల ప్రవీణ్ కుమార్, చిలువేరు అన్వేష్, కొలిపాక అశోక్, పురాని రమేష్, దేవేందర్, తప్పేట్ల సతీష్, బూరుగు సాయి, జరుపుల వీరన్న, బానోత్ సాంబయ్య, జీనుకల ప్రభాకర్, పోతురాజు కార్తీక్ రాజ్, భూక్య మల్లేష్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
