జహీరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా కృషి చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో శనివారం జరిగిన జహీరాబాద్ పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.తమ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతో పాటు రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం, కొత్త రేషన్‌కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు.
