నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి : దీక్షలో కాంగ్రెస్ నాయకులు

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి : దీక్షలో కాంగ్రెస్ నాయకులు

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా తక్షణమే నోటిఫికేషన్ లు జారీ చేయాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బనుక శివరాజ్ యాదవ్ ,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు చిలువేరు కృష్ణమూర్తి ,టీపీసీసీ కార్యదర్శి గణేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వెంటనే మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుతు నిరుద్యోగ సమస్య లు తీర్చాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ చైతన్య దీక్షా ద్వారా సీఎం కేసీఆర్ ని డిమాండ్ చేశారు.ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన తరువాత నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. అలాగే యువజన కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షులు శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ ఎన్నికల సమయంలో నీళ్ళు, నిధులు మరియు నియామకాలు కల్పిస్తాం అని చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా కెసిఆర్ ఇంట్లోనే ఉద్యోగాలు కల్పించుకొని నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. పాలకుర్తి మండల యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు భార్గవ్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే వరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నియంత ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని తెలిపారు.

పాలకుర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసు హరీశ్ మాట్లాడుతూ కెసిఆర్ గారు బార్ షాపులు, వైన్ షాపులు కాదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే తెలంగాణ కావలి అని కోరారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించమంటే గల్లికో వైన్ షాప్ తెరుస్తూ తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు అని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని పోరాడి ప్రతేక రాష్ట్రం సాధించుకుంటే కేవలం కెసిఆర్ ఇంట్లోనే రాజకీయ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారని విమర్శించారు. అలాగే ప్రతిసారీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి ట్రస్టు ద్వారా కొచిగ్ ఇస్తున్నామన్నారు కానీ అలా కోచింగ్ ఇచ్చిన వారిలో పాలకుర్తి నియోజకవర్గం నుండి ఎంత మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారో చెప్పాల్సిన బాధ్యత మీదే అని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గం లో ఉన్న నిరుద్యోగులను ఏకం చేసి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిన అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమలో ఎంపీటీసీ మానస భాస్కర్, బిసి సెల్ అధ్యక్షులు ఐలేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు భాస్కర్, చిలువీరు సంపత్, డైరెక్టర్ సోమమల్లయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాల్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హరీష్ గౌడ్,యకస్వామి, మహమూద్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పీడుగు రమేష్, సుధీర్, రవి, బనుక ప్రభాకర్, అశోక్, ప్రవీణ్, శ్రీకాంత్, నాగన్న, శంకర్, కళ్యాణ్ గౌడ్, రాజు అనిల్, హరిచందర్, సుధాకర్, వెంకట్ తిరుపతి, శేకర్, సంపత్ అఖిల్, బాబు,
నాగరాజు, రాజు,శ్రీను,రాజేష్,గణేష్ , మురళి కుస భాస్కర్, మహేందర్ తదితులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!