
-ఈసీకి ఫిర్యాదు చేసిన మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి
-దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ అక్టోబర్ 26
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల నిలిపివేతకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని, అందులో భాగంగానే దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, రైతుబంధు, గృహలక్ష్మిలాంటి పథకాలను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ..జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న నేతృత్వంలో వారి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జడ్పిటిసి జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాత సంజీవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావులు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రైతుల కోసం, దళితుల కోసం, గిరిజన మైనార్టీల కోసం, బీసీల కోసం, ఇండ్లు లేని నిరుపేద కుటుంబాల కోసం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాలను నిలిపివేయాలని అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలపాలని వారు పిలుపునిచ్చారు. పేదల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తూ..సబ్బండ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కరాబు మలహల్ రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.