Congress Holds Signature Drive Against Vote Theft
ఓటు చోరీ పేరిట కాంగ్రెస్ సంతకాల సేకరణ…
ఓటు హక్కు కోల్పోవడం అంటే సర్వం కోల్పోయినట్లే….
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఓటు హక్కు కోల్పోవడం అంటే సర్వం కోల్పోయినట్లే అని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ లు అన్నారు. గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ ఏరియాలో ఓటు చోరీ పేరిట కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు.
ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ల పిలుపుమేరకు ఓటు చోరీ పై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఓటు చోరీ ఆపాలని కేంద్రానికి సంతకం చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ప్రజలను కోరారు. ఓటు చోరీపై బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడిందని దీనిపై రాహుల్ గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు. బిజెపి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేయాలని చూస్తుందని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా ఓటు చోరీ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, మాజీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పనాస రాజు, నాయకులు గోపు రాజం, గోపతి భానేష్, భీమ మల్లేశ్, బొద్దుల ప్రేమ సాగర్,రామ్ సాయి, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు.
