
పరకాలనేటిధాత్రి :
వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని సిపిఎం పరకాల పట్టణ నాయకుడు మడికొండ ప్రశాంత్ పిలుపునిచ్చారు.
మోసపూరిత విధానాలతో కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని,బిజెపి విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని,ప్రజల మధ్య కులం మతం పేరుతో చీలికలను సృష్టిస్తూ,ప్రజా సమస్యలను చర్చ లేకుండా చేసిందని,గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు,డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిసిందని,జీఎస్టీ పేరుతో ప్రజలపై అదనపు భారపు మోపిందని,పెద్ద నోట్లు రద్దుచేసి ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని,విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి భారతీయుడు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని మోసం చేసిందని,సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధం చేసిందని,మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే దేశాన్ని కార్పొరేటు సంస్థలకు అప్పజెప్పేందుకు సిద్ధమైందని ప్రజలపై భారాలు మోపేందుకు బిజెపి ప్రధానమని పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించి బుద్ధి చెప్పాలని ప్రశాంత్ పిలుపునిచ్చారు.