*అయితే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది:ఎంపీ రవిచంద్ర
*కాంగ్రెస్ వాగ్ధానం చేసిన రుణమాఫీ,రైతుబంధు, కరెంట్, సాగు తాగునీళ్లు,పంట కొనుగోలు, గిట్టుబాటు ధర జాడనే లేదు: ఎంపీ రవిచంద్ర*
*”సంక్షేమ రాజ్యం పోయింది-సంక్షోభ రాజ్యం” నడుస్తున్నది: ఎంపీ రవిచంద్ర*
*”కాంగ్రెస్ వద్దు-కేసీఆర్ ముద్దు”అని ప్రజలంటున్నరు: ఎంపీ రవిచంద్ర*
*బీఆర్ఎస్ కు శ్వాస, ఊపిరి,పునాది కార్యకర్తలే: ఎంపీ రవిచంద్ర*
*కొందరు నాయకులు తల్లిలాంటి పార్టీని వదలివెళ్లారు,కార్యకర్తలు మాత్రం బలంగా ఉన్నరు: ఎంపీ రవిచంద్ర*
*మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి నామను అత్యధిక ఓట్లతో గెలిపిద్దాం: ఎంపీ రవిచంద్ర*
*”నేటిధాత్రి” ఖమ్మం*
*రాజ్యసభ సభ్యులు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తదితర ప్రముఖులతో కలిసి ఏన్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు*
కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని,కరువు తెచ్చిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాకపోగా రాష్ట్రం ఈ నాలుగు నెలల్లోనే తీవ్ర కరువు బారినపడిం దన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని,రైతుబంధును 15వేలకు,పింఛన్లను 4వేలకు పెంచుతామని చెప్పి మర్చిపోయారని ఎంపీ రవిచంద్ర విమర్శించారు.కరెంట్, సాగు, తాగునీళ్ల సరఫరా సరిగ్గా లేక,పంట కొనుగోళ్లు, గిట్టుబాటు ధర,బోనస్ జాడనే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, పార్టీ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు,మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ తదితర ప్రముఖులతో కలిసి ఏన్కూర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బీఆర్ఎస్ వైరా నియోజకవర్గానికి చెందిన జూలూరుపాడు, ఏన్కూర్ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ నాయకత్వంలో జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, మహానేత “సంక్షేమ రాజ్యం పోయింది-సంక్షోభ రాజ్యం” నడుస్తున్నదని,”కాంగ్రెస్ వద్దు-కేసీఆర్ ముద్దు”అని అన్ని వర్గాల ప్రజలు అంటున్నారన్నారు.బీఆర్ఎస్ కు కార్యకర్తలే శ్వాస, ఊపిరి, పునాది అని ఎంపీ వద్దిరాజు చెప్పారు.కొందరు నాయకులు తల్లిలాంటి పార్టీని వీడి వెళ్లారని,కార్యకర్తలు మాత్రం అలాగే ఉన్నారని,వారే బీఆర్ఎస్ కు బలం అని వివరించారు.మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామని ఎంపీ రవిచంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,”బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే మన ఓటు”,”గెలిపిద్దాం గెలిపిద్దాం నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే ఓటేసి గెలిపిద్దాం”అంటూ గులాబీ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.