మలహర్ రావు. నేటిధాత్రి:
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల ఎంపీడీవో కె శ్యాంసుందర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించరు. కార్యక్రమాన్ని ఉద్దేశించి తడి చెత్త, పొడి చెత్త, మీద అవగాహన కల్పిస్తూ అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, అంగన్వాడి టీచర్లు, హెల్త్ వర్కర్లు, ఎస్.హెచ్ .జి సంఘాల మెంబర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తాడిచెర్లలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమ నిర్వహణ.
