
నస్పూర్ మండలం నేటిదాత్రి
అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నస్పూర్ గ్రామంలో ని అతి పురాతన ఆలయం భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1942లో నిర్మించిన శ్రీ సీతారాముల గుడి నుండి శ్రీ సీతరాములవారి శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నస్పూర్ గేటు నుండి రామాలయం వరకు భక్తిశ్రద్ధలతో మహిళమణుల కోలాటాల తో ఎంతో అంగరంగ వైభోగంగా శ్రీ సీతారామలయ వేద పండితులు శ్రీ రంజిత్ శర్మ గారి ఆధ్వర్యంలో అతి నిష్ఠ నియమాలతో శోభాయాత్ర ను కొనసాగించారు శోభాయాత్ర అనంతరం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం4గంటలకు శవా కార్యక్రమం ఉంటుందని రామలయా పురోహితులు తెలియజేసారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు