
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ సరస్వతి శుభోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో భారతమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయిన సందర్భంగా స్కూలు విద్యార్థులు యజమాన్యం ఉపాధ్యాయులు కలిసి సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రి పని చేయడం జరిగిందని అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి భారతదేశం ఆర్థిక అభివృద్ధిలో ముందు ఉంచారని అలాగే 2005లో చట్టాలలో ముఖ్యమైన సమాచార హక్కు చట్టం తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి జవాబు దారి ఇవ్వడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించారని అదేవిధంగా 2009లో విద్యా హక్కు చట్టం చేయడం జరిగిందని ప్రతి పేదవారికి చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చట్టం ప్రతి పేదవారికి గ్రామంలోని పని కల్పించడానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చి 100 రోజుల పని కల్పించడం జరిగిందని పేదవారి కడుపు నింపిన మహనీయుడని ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అదేవిధంగా అమలు చేస్తున్నారని ఇతడికి పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగిందని ఆర్బిఐ గవర్నర్గా ఆర్థిక సంస్కరణ నిపుణులుగా పనిచేయడం జరిగిందని అలాగే ఇతను చనిపోవడం భారతదేశానికి తీరనిలోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరగా విద్యార్థులతో జాతీయ గీతాన్ని ఆలపించారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం శ్రీనివాస్ యాదవ్ ప్రిన్సిపాల్ మాధవి లతా రెడ్డి ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు