తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట సేన కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 46వ వర్ధంతి సభను నిర్వహించారు ఈ సందర్భంగా రాళ్ల పేట గ్రామ శాఖ అధ్యక్షులు సోమ ఎల్లన్న అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించిన మొదట తెలంగాణ సాయుధ పోరాటం స్థాపించిన సమయంలో ఒకరిని సాయుధ పోరాటానికి మూలంగా భయపడి నైజాం సర్కార్ తెలంగాణ వదిలి వెనక్కి వెళ్లారని ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణలో స్వేచ్ఛ స్వాతంత్రం కలగడానికి సిపిఎం పార్టీ తరపున ఎందరో కృషి త్యాగాల ఫలితంగా తెలంగాణలో బానిసత్వం లేకుండా చేశారని అంతేకాకుండా బానిసత్వానికి వ్యతిరేకంగా వెట్టిచాకిరికిన దోపిడీకి వ్యతిరేకంగా నైజాం రజాకారుల ధరల దోపిడీ దొరలజమీందారుల దోపిడీ వ్యతిరేకంగా వందలాది దళాలు నిర్మాణం చేసి సాయుధ పోరాటం నడపడం ద్వారానే 3000 గ్రామాలు విముక్తి కలిగిందని 4500 మందిగా దళాలు ఏర్పడి ఎంతోమంది తెలంగాణ కోసం అమరులు రక్తం పారించారని 10 లక్షల ఎకరాల భూమిని తెలంగాణ ప్రజలకు అంకితం చేశారని తొలిదశలోను తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలు లేకుండా తెలంగాణ ఏర్పడలేదని ఈ పోరాటం ఫలితంగానే ఆంధ్ర వలస వ్యతిరేకంగా ఆంధ్ర పెత్తందారుల దోపిడీ వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం సాగిందని వారి త్యాగాల పునాదుల మీద కమ్యూనిస్టులు లాంటి విరచిత పోరాటం చేసిన వారు అని అలాంటి త్యాగమూర్తులను త్యాగాలను చరిత్ర స్మరించుకునే విధంగా అమరుల ఖ్యాస విగ్రహాలను సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయాలని గత పది సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నామని మాదాపూర్ గుట్టల్లో అమరులైన 12 మంది సాయుధ పోరాట సభ్యులు కామ్రేడ్ సిగ్గిరెడ్డి భూపతిరెడ్డి ఒకరని సిరిసిల్ల నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేయాలని బద్దం బాల్రెడ్డిని గుర్తు చేస్తూ విలాదిమంది నిర్వాసితులుగా ఉన్న పేదలకు ఇండ్లస్థలాలు ఇప్పించే విధంగా పోరాడి న స్థలాలు మంజూరు చేయించిన ఘనత సిపిఎం పార్టీకి చేన్నమనేని రాజేశ్వర్ రావుకు దక్కుతుందని ఆ వీధికి బి వై నగర్ అని నామకరణం చేయడం జరిగిందని ఇప్పటికి అదే పేరు కొనసాగుతుందని ఈ సందర్భంగాతెలియజేశారు ఇట్టి సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు రాజేందర్ బాలనగర్సు శంకర్ బాలమల్లు పోచయ్య కనకయ్య బాలమల్లు రాజేందర్ వెంకట్ గోవిందు రాయమల్లు శంకర్ కొమరయ్య లక్ష్మయ్య మురళి బాలరాజు తదితరులు పాల్గొన్నారు