జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా యంపిడిఓలను ఆదేశించారు.
భూపాలపల్లి నేటిధాత్రి
మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో పంచాయతీరాజ్ అధికారులతో ఇంటిపన్నులు వసూళ్లు, పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి హామి పథకం పనులు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై నివేదికలు అందచేయాలని చెప్పారు. మంజూరై ఇంకా చేపట్టని పనులను రద్దు చేయాలని చెప్పారు. అలాగే చేపట్టిన పనుల యొక్క పురోగతి, చెల్లింపు చేసిన, చెల్లించాల్సిన బిల్లులపై కూడా నివేదికలు అందచేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నిర్మించే అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కట్టడాలపై గ్రామస్థాయి నుండి నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అక్రమ కట్టడాలపై ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గ్రామ పంచాయతీలో జరిగిన అన్ని అంశాలపై ప్రతి సోమవారం పంచాయతీ కార్యదర్శులు, యంపిడిఓల ద్వారా నివేదికలు అందచేయాలని డిపిఓను ఆదేశించారు. ఉపాధిహామి పథకం పనులు గురించి ప్రస్తావిస్తూ వేసవిలో చేపట్టాల్సిన పనులపై మందుస్తుగా నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఉపాదిహామి పథకం పనులపై ప్రతి వారం టెలి కాన్ఫరెన్సు నిర్వహణకు చర్యలు చేపట్టాలని డిఆర్డిఓకు సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఏడు అంశాలపై తు.చ తప్పక రిజిష్టర్లు నిర్వహించాలని చెప్పారు. ఇంటి పన్నులు వసూలు ప్రక్రియను నూరు శాతం సాధించాలని యంపిడిఓలను ఆదేశించారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్,
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పి సిఈఓ విజయ లక్ష్మీ, డిపిఓ నారాయణరావు అన్ని మండలాల యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.