‘యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి’
◆ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం పురస్కరించుకుని శనివారం జహీరాబాద్ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆదర్శ విద్యాలయంలో పతాంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. వేడుకల్లో పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యతను
వశిష్ట యోగా ప్రతినిధులు, క్రీడాకారులు ఇతర ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థినిలు వ్యాయామ ఉపాధ్యాయులు గురువులు వివరిస్తూ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.