
సమాజ మార్గదర్షి గురువు టీచర్
ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి .
తపస్ వనపర్తి జిల్లా శాఖ ఆధ్వర్యంలోగురువందన కార్యక్రమ ము సందర్భంగా వనపర్తి జిల్లాలోని 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తరతరాలుగా సమాజానికి గురువు మార్గదర్శిగా ఉంటూ విద్యార్థులను సమాజాన్ని కి అవసరం పడే వ్యక్తి గురువు అని అన్నారు నేను ఎదగడానికి గురువులు టీచర్ అందించిన విద్యా పాట వాళ్లే నా అభివృద్ధికి బాటలు వేశాయని పేర్కొనారు . ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ పత్తికొండ రాము మాట్లాడుతూ భారత్ ను విశ్వ గురువుగా తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖమైనదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ పత్తికొండ రాము తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారుజిల్లా అధ్యక్షులు అమరేందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కరుణ వనపర్తి మండల విద్యాధికారి మద్దిలేటి అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మహానంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్,దామోదర్ రెడ్డి జిల్లా మీడియా కన్వీనర్ శశివర్ధన్ వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు