
రేగొండ,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.గురువారం మండల తహశీల్దార్ కార్యాలయంలోని దరకాస్తు లను ఆయన పరిశీలించారు.గృహాలక్ష్మీ గ్యాస్ కలెక్షన్ సబ్సిడీ కొరకు చేసిన దరకాస్తులను గ్యాస్ పాస్ బుక్ జిరక్స్ బుక్ చేసిన పేపరులో ఉన్న వినియోగ దారుని నెంబర్ వేయుటకు పేపర్లు తెప్పించి ఆన్లైన్లో నమోదు చేయుటకు ఆదేశించారు.ఏవైనా అనుమానాలు ఉంటే ఆర్జిదారుని ఇంటికి వెళ్ళి మరీ సరిచూసుకోవాలి సూచించారు.సంబంధిత పనులను త్వరిత గతిన పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి సామ్యూల్,తహశీల్దార్ సత్యనారాయణ స్వామి,ఎంపిడిఒ సురేందర్ ఉన్నారు.