
రామడుగు, నేటిధాత్రి:
ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ పమెలా సత్పతి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కార్యక్రమం వారంలో రెండు రోజులు (మంగళవారం గురువారం) నిర్వహించడం జరుగుతుందని, వేసవిలో వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వోఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఈకార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గ్రీస్మన్య, తహశీల్దార్ భాస్కర్, ఎంపిడివో రాజేశ్వరి, ఎపివో రాధ, పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.