Collector Unveils International Workshop Poster
అంతర్జాతీయ కార్యశాల పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)రాజమండ్రి ఎస్.కే.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా ఈడూమెంట్ యు సరయు ఎడ్యుకేషనల్ ప్రో, వెంకట్స్ టైమ్ అనే సంస్థల సౌజన్యంతో ఇంటర్నేషనల్ ఇంటెన్సీస్ థీసిస్ రైటింగ్ వర్క్ షాప్ అనే అంశంపై ఈ నెల 16 నుండి 30 వరకు నిర్వహిస్తున్న 15 రోజుల అంతర్జాతీయ కార్యాశాలను ఆన్లైన్ విధానంలో కొనసాగించే పోస్టర్ ను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆవిష్కరించారు.మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇలాంటి ఉన్నతమైన అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నందుకు గాను ఈ ప్రోగ్రామ్ చీఫ్ పాట్రన్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ను ,ఆంగ్ల విభాగపతి, కన్వీనర్ ఎంఎంకే రహీముద్దీన్ లను జిల్లా కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నతమైన విలువలతో కూడి ఉన్నాయని ఇలాంటి కార్యక్రమాలు పరిశోధన విద్యార్థులకు ఉపయోగకరంగాను విద్యావేత్తలు పరిశోధక పత్రాలను సమర్పించడంలో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు.ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని తమ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకొని తమ యొక్క పరిశోధనలలో అగ్రగామిగా ఉండాలని ఆకాక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
