తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ ప్రవీణ్య,
సమాజ శ్రేయస్సు, జాతీయవాదమే ప్రసార మాధ్యమాల పరమావధి కావాలి
ప్రజలకు,ప్రభుత్వాని కి వారధిగా నిలవాల్సిన బాధ్యత మీడియాపై ఉంది
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలండర్ ను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వీయనియంత్రణ ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవడానికి పత్రికలు ప్రయత్నించాలన్నారు.సామాజిక సమరసత, సామాన్యుల గొంతుగా నిలవడం, అక్షరాస్యతను పెంచడం,లింగ వివక్షను రూపుమాపడం,శాంతి, సామరస్యం,జాతీయ భద్రత వంటి అంశాల్లో రాజీ పడొద్దని సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్ ప్రజా ఉద్యమంగా మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, హరిత భవనాల నిర్మాణం వంటి అంశాలను కూడా ప్రజాఉద్యమాలుగా మార్చి భవిష్యత్ తరాలకు ఓ చక్కటి సమాజాన్ని అందించడంలో మీడియా మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. వ్యవసాయరంగ ప్రగతి కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు చేరవేయడం, అన్నదాతల్లో నూతన పరిశోధనలపై చైతన్యం తీసుకురావడంపైనా పత్రికలు ప్రత్యేక దృష్టి సారించాలన్న,రైతుల సాధికారతకు పట్టం కడుతున్న,దినపత్రిక తెలంగాణ వాణి దినపత్రిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణి స్టాఫ్ రిపోర్టర్ డాక్టర్ ఆంజనేయులు, సంగారెడ్డి జిల్లా టి కుమార్,సంగారెడ్డి ఆర్సి ప్రభాకర్,సంగారెడ్డి టౌన్, బి నగేష్,జహీరాబాద్ ఆర్ సి ఎర్రోళ్ల శ్రీనివాస్, యాదగిరి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
