
Rajiv Yuva Vikasam Scheme
ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించడం జరిగినది.ఈ సందర్శనలో భాగంగా రాజీవ్ యువ వికాసము పథకంలో ఆన్లైన్లో చేసిన దరఖాస్తులు పరిశీలించడం జరిగింది. అలాగే ఎవరైనా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించినచో వాటిని మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా పూర్తి చేసి ఆన్లైన్ చేయవలసినదిగా,ఇప్పటికే ఆన్లైన్ చేసినచో ఆ దరఖాస్తులు కార్యాలయంలో సమర్పించవలసిందిగా తెలియజేశారు.కార్యలయమునకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాల వారీగా వేరు చేసి తదుపరి కార్యాచరణకు సిద్ధముగా ఉంచవలసినదిగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంఈఓ శ్రీపతి బాబురావు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.