100-Bed Hospital Launched in Vardhannapeta
విద్య, వైద్యరంగంపై ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఫోకస్..
గత ప్రభుత్వ హయాంలో వర్ధన్నపేట అభివృద్ధికి నోచుకోలేదు..
ప్రజలు సమీప ప్రాంతాల్లోనే నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేలా ఆధునిక పరికరాలు, ప్రత్యేక వైద్య విభాగాలు, సిబ్బంది నియామకాలు అన్నింటినీ ప్రాధాన్యతతో అమలు చేస్తాం…
గత ప్రభుత్వంలో శిలాఫలకాలు వేశారే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రజా ప్రభుత్వంలో చిత్తశుద్ధితో వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి…
వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఈ ఆస్పత్రి ఎంతో మేలు చేస్తుంది..
వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ 100 పడకల ఆస్పత్రికి నేడు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు కలెక్టర్ సత్య శారద దేవి
వర్ధన్నపేట( నేటిధాత్రి)
పర్వతగిరి, ఐనవోలు మండలాల ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి నేడు సుమారు రూ. 28 కోట్ల నిధులతో నిర్మించబడనున్న ఈ ఆసుపత్రికి భూమిపూజను గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, టీజీ క్యాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ
గత ప్రభుత్వ హయాంలో వర్ధన్నపేట అభివృద్ధికి నోచుకోలేదని, గత ప్రభుత్వంలో శిలాఫలకాలు వేశారే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రజా ప్రభుత్వంలో చిత్తశుద్ధితో వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. విద్య, వైద్యరంగంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, వంద పడకల ఆసుపత్రి ఈ ప్రాంత ప్రజల కళ అని, అన్ని మండలాల ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఉప్పరపల్లి వద్ద వంద పడకల ఆసుపత్రి పనులను చేపడుతున్నామని, వీలైనంత త్వరగా ఆసుపత్రి పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలోని డయాలసిస్ పేషెంట్లు వైద్యం కోసం ఎంజీఎం వెళ్లాల్సి వస్తుందని, వర్ధన్నపేట నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ మంజూరు అయిందని, డయాలసిస్ సెంటర్ మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహలకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. త్వరలోనే మున్సిఫ్ కోర్టు ప్రారంభమవుతుందని, కోర్టు ఏర్పాటు అయితే ఈ ప్రాంత ప్రజలకు హనుమకొండకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో విద్య, వైద్యం, క్రీడారంగ బలోపేతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని, త్వరలోనే నియోజకవర్గానికి స్టేడియం మంజూరు అవుతుందన్నారు. ఇటీవలే వరంగల్ జిల్లా కలెక్టర్ జల సంరక్షణలో అవార్డును అందుకున్నారని, కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మహిళా కలెక్టర్ అయిన అనునిత్యం ప్రజల్లో ఉంటూ మెరుగ్గా పనిచేస్తున్నారని, వరంగల్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా కలెక్టర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు….
“వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ప్రజలు సమీప ప్రాంతాల్లోనే నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేలా ఆధునిక పరికరాలు, ప్రత్యేక వైద్య విభాగాలు, సిబ్బంది నియామకాలు అన్నింటినీ ప్రాధాన్యతతో అమలు చేస్తాం.
ఈ ఆసుపత్రి ద్వారా అత్యవసర సేవలు, ప్రసూతి సేవలు, శస్త్రచికిత్సలు, పిల్లల వైద్య సేవలు వంటి సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అంబులెన్స్ సేవలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు త్వరితగతిన చికిత్స అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తాము.
వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఈ ఆస్పత్రి ఎంతో మేలు చేస్తుంది. ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తాం” అని అన్నారు.ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి మాట్లాడుతూ.
వర్ధన్నపేట నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుతో ఎంజీఎం ఆస్పత్రిపై భారం తగ్గుతుందని, 1-2 సంవత్సరాలు ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ప్రస్తుతం 300, 400 ఓపి పేషెంట్లు వస్తున్నారని, భవిష్యత్తులో ఒపీ పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, మెడికల్ హబ్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు…
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి, వరంగల్ జిల్లా DM&HO సాంబ శివరావు, DCH రామ్మూర్తి, సూపర్డెంట్ నరసింహ స్వామి, ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….
