నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి
దేవరకద్ర నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కూతురు వివాహం గురువారం హైదరాబాదులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు.