సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

 

కేసీఆర్ సేవా దళం అధ్యక్షుడు షేక్ అఖిల్

చేర్యాల నేటిధాత్రి…

సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం అని కేసీఆర్ సేవాదళం చేర్యాల మండల అధ్యక్షులు షేక్ అఖిల్ అన్నారు. చేర్యాల మండ పరిధిలోని కాషె గుడిసెల గ్రామంలో గ్రామానికి చెందిన షేక్.మదర్ బీ కి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 20వేల రూపాయల చెక్కును బుధవారం వారి ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని సీఎం రిలీఫ్ ఫండ్ ను ప్రతి పేద కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు షేక్. అప్జల్, కలీమ్, రిజ్వాన్, గోర, ఫకీర్,మదార్, షరీఫ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!