Demand for Tribal Development Officer in Bhupalpally
సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య కు వినతి పత్రం
భూపాలపల్లి జిల్లాకు డిటిడిఓ అధికారిని నియమించాలి
పోలం రాజేందర్
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
హైదరాబాదులో సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ శ్రీ దివ్య దేవరాజన్ వినతి పత్రం ఇచ్చిన
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొలం రాజేందర్
ఈ సందర్భంగా పోలం రాజేందర్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుమారు యాభై వేలకు పైగా ఆదివాసి గిరిజన లు ఉన్న జిల్లా ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు గిరిజన అభివృద్ధి కార్యాలయం కేటాయించి అధికారిని నియమించలేదంటే ఆదివాసులు లేరనుకుంటుందా లేదా పాలకులు వివక్ష చూపుతున్నారా అని ప్రశ్నించారు,అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నిజకవర్గం పరిధిలోని మహదేవపూర్, పలిమేల, కాటారం,మల్హరావు, మహా ముత్తారం మండలాల ఆదివాసులకు మహదేవపూర్ కేంద్రంగా ఉన్న మాడ కార్యాలయం సేవలందించింది అట్టి కార్యాలయాన్ని జిల్లాల పునర్విభజనలో భాగంగా ఈ ఐదు మండలాలను భూపాలపల్లి, ములుగు ప్రాంతాన్ని కలిపి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటుచేసి ఒకే జిల్లాలో రెండు గిరిజన అభివృద్ధి కార్యాలయాలు ఉండవని ఎత్తివేయడం జరిగిందన్నారు, మళ్ళీ ములుగు ప్రాంతాన్ని సపరేటు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మాడ కార్యాలయం కేటాయించి సేవలందించాలనే సోయి లేకుండా పోయిందన్నారు,ఆతరువాత మంత్రిగారు గిరిజన దర్బారు పెట్టి కార్యాలయాన్ని యధావిధిగా కొనసాగిస్తాము అన్నారే తప్ప ఇప్పటి వరకు అతిగతి లేదన్నారు,అదేవిధంగా ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు పొందిన రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని బ్యాంక్ మేనేజర్లకు ఐడిఎం
రీజనల్ మేనేజర్ కు,జిల్లా కలెక్టర్ కి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన పలితం లేకపోవడం వల్లనే సీఎం ప్రజావానికి రావాల్సిన దుస్థితి వచ్చిందన్నారు,ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో గిరిజన అభివృద్ధి కార్యాలయం కేటాయించి, డిటిడిఓ నీ నియమించాలని మాడ కార్యాలయానికి ఏపీఓ నీ నియమించాలి రైతులందరికీ పంట రుణాలు అందించాలని లేని యెడల పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాగాల రాజన్న ఏర్మ పున్నం, కొమరం భీం జిల్లా అధ్యక్షురాలు కోరింగ మాలాశ్రీ తదితరులు పాల్గొన్నారు
