రాముడు తెలంగాణ నుంచే వెళ్లాడు.! ఇదిగో ఆధారాలు!

సీతమ్మను అపహరించింది కూడా ఇక్క‌డే..!

యావత్ ప్రపంచం అంతా ఇప్పుడు సనాతన భారత్ వైపు చూస్తోంది…. శతాబ్దాల కల కారమవుతోన్న వేళ అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే పరుగులు తీస్తున్నాయి. అయితే ఆ అయోధ్యా శ్రీరాముడే.. మన తెలంగాణ రాముడు కూడా! అవును..! శ్రీరాముడి జన్మభూమి ఇంకెక్కడో ఉండవచ్చు. కర్మభూమి మాత్రం తెలంగాణే. ఆ మహామూర్తీ మన అడవులలో సంచరించాడు. ఇక్కడి కందమూలాలు తిన్నాడు. ఇక్కడి తోటలల్లో సీతాసమేతుడై విహరించాడు. అందుకే.. ఆ శ్రీరాముడిని తెలంగాణ ప్రజలు తమ వాడిని చేసుకున్నారు. రామన్నా.. అని ఆత్మీయంగా పిలుచుకున్నారు. ప్రతి గుండెలో ప్రతిష్ఠించుకున్నారు. అసలు రాముడు ఇక్కడికి ఎందుకుకొచ్చాడు. ఏం జరిగిందో చూద్దాం.

భద్రాచలంకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలకు ఓ ప్రత్యేకత ఉంది. రామాయణంలో ఒక ప్రముఖమైన ఘట్టం ఈ ప్రదేశంలో జరిగింది. రాముడు, సీత, లక్ష్మణుడితో వనవాసానికి బయల్దేరి గోదావరి ఒడ్డున ఒక కుటీరం ఏర్పరుచుకొని ఉన్నారు. అదే ఈ పర్ణశాల. ఇక్కడ ప్రతి రాయికి, ప్రతిగుట్టకు విశేషమైన చరిత్ర ఉంది. మరొక విశేషం ఏమిటంటే ఈ ప్రదేశం నుండే రావణాసురుడు సీతమ్మని అపహరించాడట..

సీతారాములు ఉన్న కుటీరమే పర్ణశాల. వాళ్ల వనవాసంలోని చాలా సమయం ఇక్కడే గడిపారని ఈ ప్రాంత చరిత్ర చెబుతుంది. రాధగుట్టపై చీర ఆరేసుకుందంటారు. ఇప్పుడు ఆ చోటుని నార చీర గురుతుల స్థలం అని అంటారు. పర్ణశాలకు వెళ్లే దారిలో ఒక కిలోమీటరు ముందే ఈ రాధగుట్ట ఉంది. ఇక్కడ ఇప్పుడు కూడా అప్పటి ఆనవాళ్లు ఉన్నాయి. రాధగుట్ట పక్కనే మీకు లక్ష్మణుడు, శూర్పణఖల మధ్య సంఘర్షణ జరిగిన ఒక చిన్న గుట్ట ఉంది.

భద్రాచలం స్థానికుల కథనం ప్రకారం.. రావణాసురుడు తన పుష్పకవిమానంలో ఈ ప్రాంతానికి వచ్చాడట. గోదావరి ఒడ్డున తన వాహనాన్ని ఆపి, సన్యాసి అవతారం ధరించి, పర్ణశాలకు వచ్చి. సీతమ్మవారిని అసహరించాడట. ఇదే ప్రదేశంలో సీతమ్మ బంగారు జింకను చూసి రాములవారిని ఆ జింక కావాలని కోరిందట. శ్రీరాముడు బంగారు జింక రూపంలో వచ్చిన మారీచుని సంహరించాడట. సర్ణశాలకు ఉన్న ప్రత్యేకతను పురస్కరించుకుని ఆ ప్రదేశంలో రామాయణ ఘట్టాలను కన్నులకు కట్టే బొమ్మలు, కుటీరం ఏర్పాటుచేశారు. ఇవన్నీ ఇప్పుడు పర్యాటక స్థలాలు. అయితే అయోధ్యలో మందిరం నిర్మాణం జరిగిన వెళ… ఆ శ్రీరాముడు తన ప్రాంతం నుంచే వెళ్లాడని ఇక్కడి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!