
మాదిగ అమరవీరుల కృషి ఫలితమే వర్గీకరణ
జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
మాదిగ దండోరా ఉద్యమం 3వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మాదిగ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటా దండోరా జెండాను ఎగురవేసిన ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య ఈ సందర్బంగా ఎలుకటి రాజయ్య మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం పుట్టి 31 సంవత్సరాల సందర్భంగా జిల్లా కేంద్రంలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ జెండా ఎగరావేయడం జరిగింది అని తెలియజేసారు గత 30 ఏళ్ల కాలంలో ఎన్నో నిర్భంధాలు కేసు లు జైలు జీవితం అనుభవించి ఎట్టకేలకు మాదిగల చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేసారు రాబోవు భవిష్యత్తులో మాదిగ జాతి అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తామని తెలియజేసారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పెండల దేవరాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల సతీష్ జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి మాదిగ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి శీలపాక హరీష్ టేకుమట్ల మండల అధ్యక్షులు రేణుకుంట్ల రాము కాటారం మండల అధ్యక్షులు ఆతుకురి శంకర్ మండల ప్రధాన కార్యదర్శి పసుల కుమార్ మాదిగ అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు ఆరకొండ రాజయ్య బొజ్జపెల్లి ప్రభాకర్ రేణుకుంట్ల రాజ్ కుమార్ రాజయ్య నీలయ్యలు పాల్గొన్నారు