ప్రజల హక్కులను కాపాడుతూ , దేశ అభివృద్ధిలో కీలక వ్యవస్థగా ఉండి నిత్యం పాటుపడే అత్యున్నత వ్యవస్థల్లో అతి ముఖ్యమైన న్యాయవ్యవస్థలో సైతం విధివిధానాలు తప్పుదోవపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తప్పులు జరిగితే సరిదిద్దే సుప్రిం వ్యవస్థలోనే ఇలాంటివి చోటు చేసుకోవడం పట్ల ప్రజలు , న్వాయవాదులు తీవ ఆందోళన వ్యక్తం చెస్తున్నారు. స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలో నేరారోపణలు ఎదుర్కోంటున్న నేతలు కలిసేందుకు అవకాశం కల్పించిన అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం యావత్తు న్యాయవాద వ్యవస్థ పూర్తిగా ఖండిస్తున్నట్లు న్యాయవాదులు బహిరంగ ప్రకటనలకు దిగుతున్నారు. రాష్ట్ర హైకోర్టులో జరిగే అధికారిక కార్యక్రమాలకు ఎవరిని అనుమతించాలో ఎవరిని అనుమతించకూడదో అధికారులకు తెలిసినప్పుటికి బేఖాతరు చేస్తూ ప్రజల్లో అనుమానాలు ,ఆందోళన రేకెత్తించిలా నడుచుకోవడం మంచిది కాదనే వాదనలు ఉన్నాయి.సోమవారం రాష్ట్ర హైకోర్టు సీజేఐగా జస్టీస్ సతీష్‌చం[ద శర్మ ప్రమాణస్వీకారం జరిగింది . ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు హాజరయ్యారు.
అయితే ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వాస్‌ల జారీలో సంబధిత ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయ విధంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతుంది. ప్రజలకు న్యాయాన్ని అందించడంలో ప్రజాస్వామ్య రక్షణకు మూలస్తంభంగా ఉన్న న్యాయవ్యవస్థ చీఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేర చరిత్ర కలిగి ఉండడంతో పాటు అనేక కేసులు ( రాజకీయేతర) కలిగిన వ్యక్తులను అనుమతించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అనుమతులు జారీ చేయడం వెనుక అధికారుల కారణాలేవైనా ఇది రాజకీయ కార్యక్రమాలు కావనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు అనుకుంటున్నారు. న్యాయ వ్యవస్ధ ప్రతిష్ట, హుందాతనాన్ని వెక్కిరిస్తుంది – సైదం లక్ష్మినారాయణ హైకోర్టు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి నేరారోపణలు ఎదుర్కోంటున్న వ్యక్తులను ఏ విధంగా హజరవుతున్నారో విఐపి పాస్‌లు మంజూరు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో ప్రజలకు తెలియజేయాలి.
న్యాయ వ్యవస్థ అనేది స్వయం ప్రతిపత్తి వ్యవస్థ కలిగి ఉంటుంది. ఇలాంటీ సమయంలో నేరారోపణలు ఎదుర్కోంటున్న వ్యక్తులను వ్పీబ్లే ప్రమాణస్వీకారానికి వివిధ రాజకీయ పార్టలకు చేందిన ఎంపీ , ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ , మంత్రులు సహా ఇతర రాజకీయ నేతలు హజరు కావడం వలన ముఖ్యంగా సామాన్య ప్రజల్లోన్యాయవ్యవస్థ పై అప నమ్మకం ఏర్పడటమే కాకుండా న్యాయ వ్యవస్థ ప్రతిష్ట , హుందాతనాన్ని వెక్కిరించే విధంగా ఉంటుంది. రాజకీయ నాయకులు న్యాయమూర్తులను కలవడం ఎంత వరకు సమంజసం