పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ రవిరాజు పరకాల,నడికుడ మండలాల్లో గల రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.అనంతరం సిఐ రవిరాజు మాట్లాడుతూ ఎన్నికల సంవత్సరం కావున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, ఎలక్షన్ సమయంలో ఎలాంటి నేరాలకు పాల్పడదని సత్ప్రవర్తనతోనే కలిగి ఉండాలనిసూచించడం జరిగింది.ఎవరైనా పాల్పడినట్లు తెలిస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్,సిబ్బంది పాల్గొన్నారు.