Headlines

డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం.

నెంబర్ ప్లేట్ లేని 24 వాహనాలు రెండు ఆటోలు సీజ్.

25 లీటర్ల గుడుంబా 1700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం. ఇద్దరిపై కేసు నమోదు.

చిట్యాల, నేటి ధాత్రి ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకు తండా గ్రామ పరిధిలోని ఒంటిప్ప తండ గ్రామంలో గురువారం రోజున భూపాలపల్లి డిఎస్పి ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఇందులో భాగంగా సరైన ధ్వపత్రాలు మరియు నంబర్ ప్లేట్లు లేని లేని 24 ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు సీజ్ చేయడమైనది, అలాగే 25 లీటర్ల ప్రభుత్వ నిషేధ గుడుంబా మరియు 1700 లీటర్ల బెల్లం పానుకమును ధ్వంసం చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది, ఈ సందర్భంగా డి.ఎస్.పి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయం గనుక ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అలాగే ఎటువంటి సమస్య వస్తే వెంటనే 100 కాల్ చేయగలరని ముఖ్యంగా గ్రామంలో యువకులు, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గంజాయి, గుట్కా,గుడుంబా , గ్యాంబ్లింగ్ లాంటి వాటి దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో చిట్యాల సిఐ డి మల్లేష్ యాదవ్, చిట్యాల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్, రేగొండ ఎస్సై రవికుమార్, టేకుమట్ల ఎస్సై ప్రసాద్ ,చిట్యాల సిబ్బంది మరియు సిఆర్పిఎఫ్ బృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *